Chandrababu: శాంతిభద్రతలపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

chandra babu writes letter to dgp

  • ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
  • శాంతి భద్రతలను పరిరక్షించాలి

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, శాంతి భద్రతలను పరిరక్షించాలని డీజీపీని చంద్రబాబు కోరారు. పోలీసులపై వ్యక్తిగత కేసుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు.

ఈ అప్రజాస్వామిక చర్యల గురించి డీజీపీ దృష్టికి తేవడం విపక్షనేతగా తన బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని, ఇన్ని దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు. 

Chandrababu
Telugudesam
AP DGP
  • Loading...

More Telugu News