Anu Immanuel: తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తున్న మలయాళ భామ

Anu Immanuel makes another entry into Tollywood

  • అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్
  • శైలజారెడ్డి అల్లుడు చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్
  • రవితేజ సరసన హీరోయిన్ గా ఎంపికైన కేరళ కుట్టి

మజ్ను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ మళ్లీ వస్తోంది. నా పేరు సూర్య, అజ్ఞాతవాసి వంటి భారీ చిత్రాల్లో నటించినా ఆమె రాశి మారలేదు. చివరగా శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నటించింది. అప్పటినుంచి రెండేళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించలేదీ మలయాళ భామ. ప్రస్తుతం ఆమె అల్లుడు అదుర్స్ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

ఈ క్రమంలో రవితేజ లేటెస్ట్  సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా బుక్కయింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయబోయే రీమేక్ లో మాస్ మహారాజా సరసన కనిపించనుంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా అను సక్సెస్ బాట పడుతుందేమో చూడాలి!

Anu Immanuel
Tollywood
Alludu Adurs
Raviteja
Kerala
  • Loading...

More Telugu News