Harish Rao: సిద్ధిపేట అమ్మాయి వెన్నెలకు హరీశ్ రావు ప్రశంసలు

Minister Harish Rao appreciates Vennela Reddy who got ninth rank in national level entrance test

  • ఫారెస్ట్ కోర్సుల ఎంట్రన్స్ లో వెన్నెలకు 9వ ర్యాంకు
  • జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన తెలంగాణ బిడ్డ
  • ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించిన హరీశ్

ఓ చదువుల తల్లిని మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు. సిద్ధిపేట అర్బన్ మండలం బక్రీచెప్యాల గ్రామానికి చెందిన వెన్నెల రెడ్డి ఇటీవల నిర్వహించిన ఎమ్మెస్సీ ఫారెస్ట్ జాతీయ ఎంట్రన్స్ టెస్టులో 9వ ర్యాంకు సాధించింది. దేశంలోనే వెన్నెల టాప్-10లో నిలవడం పట్ల హరీశ్ రావు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. వెన్నెలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్టమొదటి విద్యార్థినిగా సిద్ధిపేట జిల్లా ఖ్యాతిని చాటిందంటూ ఆయన కొనియాడారు. అంతేకాదు, అరుదైన కోర్సులో చేర్పించి, ఆమెను ప్రోత్సహించారంటూ వెన్నెల తల్లిదండ్రులు రేవతి, కొండల్ రెడ్డిలను కూడా హరీశ్ రావు అభినందించారు.

కొండల్ రెడ్డి, రేవతి దంపతుల పెద్దకూతురైన వెన్నెల ములుగు ఫారెస్ట్రీ కోర్సుల కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆపై నేషనల్ ఎంట్రన్సులో మెరుగైన ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఆమెకు సుప్రసిద్ధ బెనారస్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీలో సీటు వచ్చింది.

  • Loading...

More Telugu News