upsc: ఎన్నో జాగ్రత్తల నడుమ దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్‌ పరీక్ష.. ఫొటోలు ఇవిగో

civils exam in india

  • దేశ వ్యాప్తంగా 72 పట్టణాల్లో పరీక్ష
  • ఏపీ నుంచి పరీక్ష రాస్తోన్న 30,199 మంది
  • ఏపీలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలు
  • తెలంగాణలో 115 పరీక్షా కేంద్రాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్స్‌-2020 ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఎన్నో జాగ్రత్తల నడుమ ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ పరీక్షను 11.30 వరకు రాస్తారు. అలాగే, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండో సెషన్‌లోనూ పరీక్ష జరుగనుంది. సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 68 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాల్లో మొత్తం 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్‌లోని 99 పరీక్షా కేంద్రాల్లో 46,171 మంది పరీక్ష రాయనున్నారు. వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. కరోనా నేపథ్యంలో  అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.  
      

             
      

  • Error fetching data: Network response was not ok

More Telugu News