INS Virat: ఐఎన్ఎస్ విరాట్ నౌకను రూ.100 కోట్లకు విక్రయించడానికి సిద్ధమైన శ్రీరామ్ గ్రూప్

INS Virat is ready for  sale

  • 2017లో విధుల నుంచి తప్పుకున్న ఐఎన్ఎస్ విరాట్
  • రూ. 38.54 కోట్లకు దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ 
  • ముంబై సంస్థకు రూ. 100 కోట్లకు విక్రయించేందుకు నిర్ణయం

ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక 1987లో ఇండియన్ నేవీలో చేరింది. అప్పటి నుంచి దేశానికి ఎన్నో సేవలందించి 2017లో విధుల నుంచి తప్పుకుంది. గత ఏడాది దీన్ని వేలం వేయగా శ్రీరామ్ గ్రూప్ రూ. 38.54 కోట్లకు దక్కించుకుంది.

అనంతరం దీన్ని గుజరాత్ తీరంలోని అలంగ్ వద్ద ఉన్న యార్డుకు చేర్చారు. ఈ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చాలని ముంబైకి చెందిన ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రక్షణశాఖ నుంచి ఎన్వోసీ రాగానే రూ. 100 కోట్లకు సదరు సంస్థకు విక్రయించేందుకు అంగీకరించినట్టు శ్రీరామ్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

INS Virat
Museum
Sriram Group
  • Loading...

More Telugu News