Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anupama Parameshvaran out of Kartikeya sequel

  • సీక్వెల్ నుంచి తప్పుకున్న అనుపమ
  • వెయిట్ పెంచుతున్న రామ్ చరణ్
  • చైతు సినిమాకి భారీ ఆఫర్లు  

*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయికగా మొదట్లో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో డేట్స్ సర్దుబాటు చేయలేక అనుపమ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ రోల్ ని పోషిస్తున్నాడు. ఈ పాత్ర పోషణ కోసం చరణ్ ఇప్పుడు కాస్త వెయిట్ పెంచుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చరణ్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడు.
*  అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి ఓటీటీ ప్లేయర్స్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. అయితే, థియేటర్లోనే రిలీజ్ చేయాలన్న నిర్మాతల ఆలోచన కారణంగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఇవ్వడం లేదని తెలుస్తోంది.

Anupama
Nikhil
Ramcharan
Sai Pallavi
  • Loading...

More Telugu News