హీరో సుశాంత్ ప్రియురాలు రియా బయోపిక్ కోసం ప్రయత్నాలు!
- దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోన్న రియా పేరు
- డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టు
- సినీ రంగంలోకి రియా ఎంట్రీ నుంచి సినిమా?
- రియా బయోపిక్ పై పుస్తకం కూడా?
రియా చక్రవర్తి సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం, సుశాంత్ సింగ్‌తో ఆమె ప్రేమలో పడడం, సుశాంత్ మృతి అనంతరం ఆమెపై ఆయన తండ్రి ఆరోపణలు చేయడం, డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం లాంటి వాటిపై స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో బాలీవుడ్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, ఓ ప్రచురణ సంస్థ రియా చక్రవర్తి బయోపిక్ పై పుస్తకం తీసుకొచ్చేందుకు ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.