China: సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఎవరికీ చెప్పవద్దంటూ... ప్రజలకు సీక్రెట్ గా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్న చైనా!
- ముందుగానే నాన్ డిస్ క్లోజర్ ఒప్పందంపై సంతకాలు
- ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించలేక పోతున్న ప్రజలు
- సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం
ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కు తమ దేశపు ఫార్మా కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్, మూడవ దశ ప్రయోగాల దశలో ఉండగానే, చైనా వాటిని ఎమర్జెన్సీ వాడకం కింద ప్రజలకు ఇస్తోంది. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల ఉద్యోగులు,ఆర్మీ, పోలీస్, కస్టమ్స్ విభాగం ఉద్యోగులు, సూపర్ మార్కెట్లలో పనిచేసేవారు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా పలు విభాగాల వారికి ఈ 'అత్యవసర' వ్యాక్సిన్లు ఇస్తోంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురైనా, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పరాదని హెచ్చరికలు జారీ చేస్తూ, వారి నుంచి నాన్ డిస్ క్లోజర్ ఒప్పందాలపై సంతకాలు తీసుకుంటోంది.
ఇక, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అత్యవసర వ్యాక్సిన్ తో చెడు జరుగుతున్నా, ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసాన్ని ఎవరూ చేయలేక పోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. సినో ఫార్మా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ లను ఇప్పటికే లక్షలాది మందికి ఇచ్చారని తెలుస్తుండగా, దీన్ని చైనా హెల్త్ కమిషన్ తోసిపుచ్చింది.