TDP: టీడీపీకి గుడ్‌ బై  చెప్పిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు

former MLA Gadde Babu Rao quits TDP

  • విజయనగరంలో టీడీపీకి ఎదురుదెబ్బ
  • ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానన్న బాబూరావు
  • తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానన్న మాజీ ఎమ్మెల్యే

విజయనగరంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ విప్, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. నిన్న ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ.. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు.

అయినప్పటికీ ఏనాడూ వెనకడుగు వేయలేదని, ముందుకే సాగానని పేర్కొన్నారు. టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేశానని, ఎమ్మెల్యేగా చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. టీడీపీలో కొనసాగితే నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేనని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని నిర్ణయించుకోలేదని, త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తానని బాబూరావు తెలిపారు.

TDP
Vizianagaram
Gadde Baburao
chipurupalle
  • Loading...

More Telugu News