Vikarabad District: వికారాబాద్ లో రోడ్డుపై వెళుతున్న యువతి కిడ్నాప్... నిన్న సాయంత్రం నుంచి పోలీసుల వెతుకులాట!

Lady Kidnap in Vikarabad

  • నడిచి వెళుతుండగా కిడ్నాప్
  • కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు
  • అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని అంచనా

ఆదివారం సాయంత్రం వికారాబాద్ లో జరిగిన ఓ యువతి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపగా, కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు, ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించి, వెతుకులాట ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, దీపిక అనే యువతి మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు.

ఆ వెంటనే స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ టీమ్ లను పంపారు. దీపిక నాలుగేళ్ల క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని, కొద్ది కాలానికే అతనికి దూరమైందని తెలుస్తోంది. అఖిల్ ఆమెను కిడ్నాప్ చేశాడా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.

Vikarabad District
Kidnap
Deepika
  • Loading...

More Telugu News