Corona Virus: కేంద్ర పోలీసు బలగాలపై కరోనా పంజా.. 36 వేల మందికి కొవిడ్

36 thousnad corona cases in central police force
  • కరోనా కారణంగా 120 మంది మృతి
  • ఇంకా యాక్టివ్‌గా 6 వేల కేసులు
  • బీఎస్ఎఫ్‌లో 10,636 మందికి కరోనా
దేశంలో ఏమాత్రం తగ్గుముఖం పట్టని కరోనా మహమ్మారి తన విజృంభణ కొనసాగిస్తుండగా, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్‌కు చెందిన దాదాపు 36 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 128 మంది మృతి చెందినట్టు తాజా నివేదికను బట్టి తెలుస్తోంది. 30 వేల మంది వైరస్ నుంచి బయటపడగా, 6 వేల మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు 10,636 మంది కరోనా బారినపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి ఈ మహమ్మారి సోకింది. వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోగా, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీలలో 9 మంది చొప్పున మృతి చెందారు.
Corona Virus
India
BSF
CISF
SSB
NDRF

More Telugu News