Deepika Padukone: దీపికా పదుకొనే మాత్రమే కాదు... రకుల్, సారా అలీ ఖాన్ ఫోన్లను కూడా వెనక్కు ఇవ్వని అధికారులు!

Many Heroins Phones Sease in Drugs Case
  • తీవ్ర కలకలం రేపుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
  • రోజుకో కొత్త విషయం వెలుగులోకి
  • దీపికకు క్లీన్ చిట్ ఇవ్వని అధికారులు
  • మరోసారి విచారణకు పిలుపు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో వరుసగా హీరోయిన్లకు సమన్లు పంపి విచారిస్తున్న మహారాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, మొత్తం డ్రగ్స్ దందాకు దీపికా పదుకొనే మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సాక్ష్యాలు సంపాదించారని తెలుస్తోంది. ఆమె అడ్మిన్ గా ఉన్న వాట్స్ యాప్ గ్రూప్ లోనే చాటింగ్ అంతా జరిగిందని నిర్ణయానికి వచ్చిన అధికారులు, శనివారం నాటి విచారణలో ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వకపోగా, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని, మరోసారి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అంతకుముందు విచారించిన నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ల స్మార్ట్ ఫోన్లను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ అనంతరం బయటకు వచ్చే సమయంలో వీరికి ఇవ్వలేదు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని మరింతగా విశ్లేషించేందుకు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇక టాలెంట్ మేనేజర్ జయా సాహా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా, తదితర తాము విచారించిన ఎవరి ఫోన్లనూ వెనక్కు ఇవ్వలేదని ఎన్సీబీ వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా, ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న ఎల్విన్ గెస్ట్ హౌస్ ను వేదికగా చేసుకుని విచారణ ప్రారంభించిన నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, సుశాంత్ అత్మహత్య తరువాత, అతని ప్రియురాలు రియాతో మొదలు పెట్టి, పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో అధికారులకు పలు కీలక విషయాలను నటీమణులు వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది.
Deepika Padukone
Rakul Preet Singh
Bollywood
Drugs Case

More Telugu News