Maoist: మావోయిస్టుల కిరాతకం.. 16 మంది గ్రామస్తులను హత్య చేసిన వైనం!

Maoists  kills 16 villages

  • ఇటీవల 25 మందిని అపహరించిన మావోలు
  • ప్రజా కోర్టులో నలుగురి హత్య
  • అనంతరం ఐదుగురి విడుదల

కరోనా సమయంలో అందరూ ఈ మహమ్మారిపై దృష్టి సారించిన సమయంలో మావోయిస్టులు మాత్రం వారి కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. వారి కదలికలు పెరిగిన నేపథ్యంలో వారికోసం ప్రత్యేక సాయుధ బలగాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మందిని హత్య చేశారు.

ఇటీవలే 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతులు కోసి హతమార్చారు. అనంతరం ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలోనే ఉంచుకున్న మిగతా 16 మందిని ఈరోజు హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

Maoist
Chhattisgarh
Murder
  • Loading...

More Telugu News