ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట!
- ఎన్నో భాషల్లో 40 వేల పాటలు
- చివరిగా 'పలాస 1978' వినిపించిన గొంతు
- 'ఓ సొగసరి...' అంటూ సాగే పాట
'పలాస 1978' సినిమా కోసం రఘు కుంచె స్వరపరిచిన 'ఓ సొగసరి...' అంటూ సాగే పాటను ఆయన పాడారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న రఘు, అంతటి మహానుభావుడితో పాట పాడించడం తన అదృష్టమని అన్నారు. ఎస్పీబీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, మనం ఓ గొప్ప గాయకుడిని కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఇదే.