Nithin: 'రంగ్ దే' షూటింగ్ మొదలెట్టిన నితిన్

Nithin starts shoot for Rangde

  • నితిన్, కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే'
  • హైదరాబాదులో తాజా షెడ్యూల్
  • సంక్రాంతికి థియేటర్లలో సినిమా    

కరోనా ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ ఒక్కొక్కరే తమ తమ సినిమాల షూటింగులు ప్రారంభిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ధైర్యంగా సెట్స్ కి వస్తున్నారు. తక్కువ మంది యూనిట్ సభ్యులతో, కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ రంగంలోకి దిగుతున్నారు.

ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ కూడా ఈ రోజు తన 'రంగ్ దే' చిత్రం షూటింగును హైదరాబాదులో మొదలెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేశ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ గతంలోనే జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో గత ఆరు నెలలుగా ఈ షూటింగ్ కూడా మిగతా వాటిలానే ఆగిపోయింది.

'ఇప్పుడు అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుని షూటింగ్ తిరిగి ప్రారంభించామని' చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సంక్రాంతికి చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో విడుదల చేస్తామని కూడా వెల్లడించారు. అంటే ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద సినిమాలతో పోటీకి దిగనుందన్న మాట!

  • Error fetching data: Network response was not ok

More Telugu News