Devineni Uma: పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా?: దేవినేని ఉమ
- 3 మండలాల్లోనే జరిగిన 27 వేల క్రయవిక్రయాల వెనుక పెద్దలు ఎవరు?
- మీ నేతలు కొన్న భూములు అమ్ముకోవడానికే పాలనా రాజధానా?
- విశాఖలో జరిగిన రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వైజాగ్‌లో 72 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, అలాగే, ఆ ప్రాంతాన్ని పాలనా రాజధానిగా ప్రకటించకముందు గత ఏడాది 55,221 రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ యథేచ్ఛగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా? అని అమరావతి రైతులు, సంఘాలు ప్రశ్నిస్తున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు.
'పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా? 3 మండలాల్లోనే జరిగిన 27 వేల క్రయవిక్రయాల వెనుక పెద్దలు ఎవరు?మీ నేతలు కొన్న భూములు అమ్ముకోవడానికే పాలనా రాజధానా? ఏది ఇన్సైడర్ ట్రేడింగ్? ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో జరిగిన 72 వేల రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా వైఎస్ జగన్?' అని దేవినేని ఉమ నిలదీశారు.