Varla Ramaiah: కొడాలి నానిపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య

Kodali Nani has to be arrested demands Varla Ramaiah
  • హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారు
  • మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారు
  • హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలి
హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, కొడాలి నాని వ్యాఖ్యలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మతాల మధ్య చిచ్చురేపేలా ఉన్నాయని దుయ్యబట్టారు. హైందవ లోకానికి నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన నానిపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Varla Ramaiah
Telugudesam
Kodali Nani
YSRCP

More Telugu News