Galla Jayadev: అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: లోక్‌సభలో గల్లా జయదేవ్
- అమరావతిలో రూ. 41 వేల కోట్ల పనులు జరిగాయి
- రాజధాని మార్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు
- అమరావతి అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలి
మూడు రాజధానుల అంశానికి అధికార వైసీపీ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం రాజధానిని మార్చవద్దని, అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభలో అమరావతి అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.
ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని జయదేవ్ డిమాండ్ చేశారు. అమరావతిలో రూ. 41 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. రాజధానిని మార్చడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో లేని అంశాలపై పార్లమెంటు ద్వారా చట్టం చేయవచ్చని తెలిపారు.