Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంట పెళ్లిసందడి! 

Asaduddin Owaisis daughters marriage on 22

  • ఒవైసీ రెండో కుమార్తె వివాహం
  • వరుడు ఒవైసీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారుడు
  • కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమార్తె వివాహం ఈనెల 22న జరగనుంది. ఒవైసీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజహర్ కుమారుడు డాక్టర్ అబిద్ అలీఖాన్ తో ఒవైసీ కుమార్తె వివాహం జరగనుంది. ఈనెల 22న అసదుద్దీన్ ఇంట్లో నిఖా, 25న వలీమా జరగనున్నాయి. వరుడు ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ చీఫ్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కు బంధువు అవుతారు. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు.  

Asaduddin Owaisi
Daughter
Marriage
MIM
  • Loading...

More Telugu News