Balineni Srinivasa Reddy: చంద్రబాబుకు వ్యవస్థపై నమ్మకం ఉంటే స్టేలు తొలగించుకోవాలి: మంత్రి బాలినేని

balineni slams cbn

  • ఇప్పటికే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు
  • ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయొద్దని కోర్టులు అంటున్నాయి
  • అమరావతి కుంభకోణం విషయంలో కోర్టుల తీరు ఆక్షేపణీయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు.  వ్యవస్థపై ఆయనకు నమ్మకం ఉంటే కోర్టుల నుంచి ఆయన తెచ్చుకున్న స్టేలను తొలగించుకుని నిజాయతీని నిరూపించుకోవాలని ఆయన చెప్పారు.  

'ఇప్పటికే 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకున్నాడు. వ్యవస్థపై నమ్మకం ఉంటే స్టేలు తొలగించుకుని సచ్ఛీలతను నిరూపించుకోవాలి. ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయొద్దనడం, మీడియా, సోషల్‌ మీడియాపై నిషేధం విధించడం, అమరావతి కుంభకోణం విషయంలో కోర్టుల తీరు ఆక్షేపణీయం' అని ఆయన ట్వీట్ చేశారు.  

Balineni Srinivasa Reddy
YSRCP
Chandrababu
  • Error fetching data: Network response was not ok

More Telugu News