Bars: మందుబాబులకు శుభవార్త... ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న బార్లు

Bars in AP will be opened from tomorrow
  • బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ ఉత్తర్వులు
  • వచ్చే ఏడాది జూన్ వరకు లైసెన్సులు కొనసాగింపు
  • ఈసారి బార్ల లైసెన్సులపై కొవిడ్ రుసుం
రాష్ట్రంలో గత కొంతకాలంగా బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సర్కారు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రేపటి నుంచి రాష్ట్రంలో బార్లు తెరుచుకోనున్నాయి. 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఈసారి బార్ల లైసెన్సులపై కొవిడ్ రుసుం విధించారు. 20 శాతం మేర విధించిన ఈ రుసుంను 2020-21 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ వసూలు చేయనుంది. అంతేకాదు, బార్లలో మద్యం విక్రయాలపై 10 శాతం రిటైల్ పన్ను వసూలు చేయనున్నారు. లైసెన్సు రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా 10 శాతం మేర పెంచారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Bars
Andhra Pradesh
YSRCP
License
Corona Virus

More Telugu News