Kesineni Nani: జగన్ గారూ.. ఇలాంటి వాటి కోసం మీ ఎంపీలు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు: కేశినేని నాని

YSRCP MPs has to fight for states interests says Kesineni Nani

  • రాష్ట్రాలు కోరితే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుంది
  • సీబీఐ విచారణ కోసం ఆందోళన చేయాల్సిన అవసరం లేదు
  • రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం పోరాడండి

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ తీరును తప్పుపడుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిన్న వైసీపీ ఎంపీలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందిస్తూ, ఏ అంశం మీదనైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే దానికి కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయతీ అని చెప్పారు. దానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

'జగన్ గారూ, రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం మీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారు. చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన పోరాటం చేయండి' అని కేశినేని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News