Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Tamanna about Nepotism in film industry
  • 'బోలెడు అవకాశాలు' అంటున్న తమన్నా
  • దీపావళికి ఓటీటీలో విశాల్ 'చక్ర'
  • విక్రమ్ సినిమా కోసం చెన్నైలో రష్యా!      
*  'సినిమా ఇండస్ట్రీలో మనకంటూ ఎవరూ లేకపోయినా కూడా సక్సెస్ అవ్వచ్చు..' అంటోంది కథానాయిక తమన్నా. 'టాలెంట్ ఉండాలే కానీ ఇక్కడ ఎదగడానికి బోలెడన్ని అవకాశాలు వున్నాయి. మన వెనుక ఎవరో ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతామన్నది నిజం కాదు. నేను, కాజల్, సమంత.. మేమంతా అలా ఎవరూ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్లమే కదా? టాలెంట్, కృషి వుంటే సక్సెస్ అదే వస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో నెపోటిజం రాజ్యమేలుతోందంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ అలా స్పందించింది.    
*  విశాల్ కథానాయకుడుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'చక్ర' చిత్రం 'జీ5' ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీపావళి పండుగ నుంచి ఈ చిత్రాన్ని జీ5లో స్ట్రీమింగ్ చేస్తారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది.
*  విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న 'కోబ్రా' చిత్రం షూటింగ్ చాలావరకు రష్యాలో జరిగింది. కరోనా మహమ్మరి వ్యాప్తి నేపథ్యంలో చిత్రం యూనిట్ షూటింగ్ కేన్సిల్ చేసుకుని చెన్నైకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు మిగిలిన షూటింగును చెన్నైలో స్టూడియోలో చేస్తారట. ఇందుకోసం రష్యన్ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ వేస్తున్నారు.  
Tamannaah
Vishal
Shradda Srinath
Vikram

More Telugu News