Amani: పాతికేళ్ల తర్వాత మళ్లీ అఖిల్ కి తల్లిగా నాటి కథానాయిక!

Amani to play mother to Akhil

  • 'సిసింద్రీ'లో అఖిల్ కి తల్లిగా ఆమని
  • సురేందర్ రెడ్డితో అఖిల్ తాజా చిత్రం
  • అఖిల్ తల్లి పాత్రలో మళ్లీ ఆమని
  • ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్.. త్వరలో షూటింగ్  

పాతికేళ్ల క్రితం వచ్చిన 'సిసింద్రీ' సినిమా తెలుగు తెరకు ఓ ప్రయోగాత్మక చిత్రం లాంటిది. చిన్న పిల్లాడిని ప్రధాన పాత్రగా తీసుకుని నడిపిన కథ అందర్నీ ఆకట్టుకుంది. అందులో సిసింద్రీగా అఖిల్ అక్కినేని నటించగా.. అతని తల్లిగా అప్పటి యంగ్ హీరోయిన్ ఆమని నటించింది.

విశేషం ఏమిటంటే, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అఖిల్ కి ఆమె అమ్మగా ఓ చిత్రంలో నటించనుంది. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న అఖిల్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో ఇందులో హీరో అఖిల్ తల్లి పాత్ర కూడా కీలకమైన పాత్ర అనీ, దీనికి టాలెంటెడ్ ఆర్టిస్టు అయిన ఆమనిని ఎంచుకున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం షూటింగ్ పూర్తవగానే, ఈ కొత్త చిత్రం మొదలవుతుంది.

Amani
Akhil
Surendar Reddy
Sisindri
  • Loading...

More Telugu News