Kangana Ranaut: మీ కూతురు కూడా నాలా లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ఇలాగే మాట్లాడతారా?: జయాబచ్చన్‌పై కంగన ఫైర్

KanganaTeam Jaya ji would you say the same thing if in my place it was your daughter Shweta beaten

  • రాజ్యసభలో జయ వ్యాఖ్యలకు అభ్యంతరం
  • నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉంటే ఏం చేస్తారు?
  • సుశాంత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ ఉంటే?
  • మాపై కూడా కాస్త దయ చూపండి 

డ్రగ్స్‌ విషయంలో సినీ పరిశ్రమపై నిందలు వేస్తున్నారని, సొంత పరిశ్రమకే ద్రోహం చేస్తున్నారని, ఆ రంగానికి ప్రభుత్వ మద్దతు కావాలని రాజ్యసభలో ఈ రోజు ఎంపీ జయాబచ్చన్ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్.. జయాబచ్చన్‌పై మండిపడుతూ ట్వీట్ చేసింది.

'జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ ఉంటే కూడా ఇలాగే మాట్లాడేవారా? మీ కూతురు శ్వేత టీనేజ్‌లో నాలా బాలీవుడ్‌లో దెబ్బలు తిని, డ్రగ్స్‌కు అలవాటుపడి, లైంగిక వేధింపులకు గురయితే ఇలాగే మాట్లాడతారా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ తరుచూ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా? మాపై కూడా కాస్త దయ చూపండి' అని కంగనా రనౌత్ మండిపడింది.

కాగా, హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో కొత్తగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ గురించి ఇటీవల కంగనా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నటనలో ఆసక్తి ఉండడంతో తాను టీనేజీలో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని, ఈ క్రమంలో డ్రగ్స్‌కి కూడా బానిసను అయ్యానని ఆమె తెలిపింది. చాలా మంది చెడ్డవారి చేతుల్లో తాను ఇబ్బందులు పడ్డానని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News