Petrol: నేడు మరి కాస్త తగ్గిన పెట్రోలు ధర!

Petrol and Diesel Price Slashed

  • 18 పైసల వరకూ తగ్గిన పెట్రోలు ధర
  • డీజిల్ ధరలో 24 పైసల వరకూ కోత
  • హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ. 84.75 

ఇండియాలో పెట్రో ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. తాజా మార్పుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు, డీజిల్ ధర రూ. 79.08కి దిగివచ్చాయి. ఇదే సమయంలో అమరావతిలో పెట్రోలు ధర 17 పైసలు తగ్గగా, లీటరు రూ. 86.34కు, డీజిల్ ధర 23 పైసలు తగ్గగా, లీటరు రూ. 80.27కు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడంతో, ఒకటి, రెండు రోజుల్లోనే ఇండియాలోనూ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.05 శాతం పెరిగి, బ్యారల్ కు 39.63 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 0.11 శాతం పెరిగి 37.30 డాలర్ల వద్ద కొనసాగింది.

  • Loading...

More Telugu News