nayanatara: ప్రియుడితో కలిసి గోవాలో నయనతార.. ఫొటోలు వైరల్

vignesh shares nayan images

  • పోస్ట్ చేసిన విఘ్నేశ్ 
  • సెలవుల  నుంచి ట్రిప్‌ ఫీలింగ్‌లోకి వచ్చామని వ్యాఖ్య
  • తెలుపు రంగు గౌనులో నయనతార

తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి హీరోయిన్ నయనతార గోవాలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తోంది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ తన‌ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. తాము సెలవుల  నుంచి ట్రిప్‌ ఫీలింగ్‌లోకి వచ్చామని ఆయన పేర్కొన్నాడు. తెలుపు ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుందని ఆయన పేర్కొంటూ, నయనతార తెలుపు రంగు గౌను ధరించి అక్కడి ప్రాంతాలను చూస్తోన్న ఫొటోలను పోస్ట్ చేశాడు.
 
నయనతారతో పాటు విఘ్నేశ్ కుటుంబ సభ్యులు కూడా వారి వెంట గోవాకు వెళ్లారు. తన తల్లి ఫొటోలను కూడా విఘ్నేశ్ షేర్ చేశాడు.  తన తల్లి ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుందంటూ ఆయన పేర్కొన్నాడు. మన తల్లిదండ్రుల సంతోషానికి మించిన సంతృప్తి, ఆనందం మరొకటి ఉండదని ఆయన చెప్పాడు. కాగా, కొన్నేళ్లుగా నయనతారతో విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి.  
 

nayanatara
Tollywood
goa
  • Loading...

More Telugu News