Parliment Members: పార్లమెంటులో కరోనా పరీక్షలు... 17 మంది ఎంపీలకు పాజిటివ్
- నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- ప్రతి సభ్యుడికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు
- ఎన్.రెడ్డెప్ప, గొడ్డేటి మాధవిలకు కరోనా నిర్ధారణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గుర్తిచేస్తున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాల కోసం మునుపెన్నడూ లేనంతగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో ఎంపీలందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కూడా ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడు కరోనా టెస్టులు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు నిన్న, ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన ఎంపీలు వీరే...
- ఎన్.రెడ్డెప్ప
- గొడ్డేటి మాధవి
- మీనాక్షి లేఖి
- అనంత్ కుమార్ హెగ్డే
- పర్వేశ్ సాహిబ్ సింగ్
- సుఖ్ బీర్ సింగ్
- హనుమాన్ బేణివాల్
- సుకనాటా మజుందార్
- ప్రతాప్ రావ్ జాదవ్
- జనార్దన్ సింగ్
- బిద్యుత్ బరణ్
- ప్రదాన్ బారువా
- జి. సెల్వమ్
- ప్రతాప్ రావ్ పాటిల్
- రామ్ శంకర్ కతేరియా
- సత్యపాల్ సింగ్
- రోద్మాల్ నాగర్