Kangana Ranaut: బరువెక్కిన హృదయంతో ముంబైని వీడి వెళ్తున్నా: కంగనా రనౌత్

Kangana Ranaut left Mumbai

  • ఒకప్పుడు ముంబైలో తల్లి స్పర్శను అనుభవించా
  • ఇప్పుడు ముంబైలో బతికుండటమే లక్కీ అనిపిస్తోంది
  • శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయింది

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ముంబైని వీడి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, బరువెక్కిన హృదయంతో ముంబైని వీడి వెళ్లిపోతున్నానని తెలిపింది. వరుస దాడులతో, దారుణ వ్యాఖ్యలతో తనను భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత తన ఇంటిని కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే ముంబైని పీఓకే అంటూ తాను చేసిన కామెంట్ కరెక్టే అనిపిస్తోందని చెప్పింది. ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ఆమె ఈ ట్వీట్ చేసింది. ముంబై నుంచి హిమాచల్ ప్రదేశ్ కు బయల్దేరింది.

హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లే క్రమంలో తన హోమ్ టౌన్ చండీగఢ్ లో కంగనా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఆమె మరో ట్వీట్ చేసింది. ఈసారికి తాను ముంబై నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పింది. ఒకానొక సమయంలో ముంబైలో తాను ఒక తల్లి స్పర్శను అనుభవించానని... కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబైలో తాను బతికుండటమే లక్కీ అనిపిస్తోందని తెలిపింది. ఎప్పుడైతే శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయిందో... ముంబై అధికార యంత్రాంగమంతా టెర్రర్ గ్రూపులా తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Kangana Ranaut
Bollywood
Shiv Sena
Mumbai
  • Loading...

More Telugu News