neet exam: 12 మంది నీట్ విద్యార్థుల ఆత్మహత్యకు కేంద్ర సర్కారే కారణం: లోక్‌సభలో డీఎంకే ఎంపీ
- సీబీఎస్ఈ ద్వారా నీట్ నిర్వహణ
- 12వ తరగతి ఫలితాలు వచ్చిన నెలలోపే నీట్ పరీక్ష
- దీంతోనే ఇబ్బందులు పడుతున్నారు
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. నీట్ పరీక్ష నిర్వహణపై లోక్‌సభలో జీరో అవర్ లో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడారు. నీట్ పరీక్ష భయంతో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర బోర్డు ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులు సీబీఎస్ఈ ద్వారా నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రాయడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెప్పారు.
అంతేగాక, 12వ తరగతి ఫలితాలు వచ్చిన నెలలోపే నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. ఈ కారణాల వల్ల డాక్టర్లు కావాల్సిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వారి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.
కాగా, జీరో అవర్‌లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చైనా తీరుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చైనా దురాక్రమణలపై స్పష్టతనివ్వాలని అన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో పంజాబీని అధికారిక భాషగా గుర్తించాలని కాంగ్రెస్ ఎంపీ మనీత్ తివారీ అన్నారు. అనంతరం లోక్‌సభ రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.