Telangana: నది దాటుతూ, డ్రోన్ కెమెరాకు చిక్కిన మావోయిస్టులు... విజువల్స్ ఇవిగో!

  • తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఘటన
  • అప్రమత్తమైన పోలీసులు
  • భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభం
Drone Visuvals of Maoists in Chattisghad

చత్తీస్ గఢ్ లో పోలీసులు ప్రయోగించిన డ్రోన్ కెమెరా కంట మావోయిస్టులు పడ్డారు. అడవుల్లో మావోలు డ్రోన్ కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఓ నదిని దాటుతున్న చిత్రాలను డ్రోన్ కెమెరాలు అందించడంతో, ఆ ప్రాంతంలోని పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. సుమారు నెల రోజులుగా తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోల కదలికలు అధికంగా ఉన్నాయని తెలుస్తుండగా, తాజాగా డ్రోన్ కెమెరాల్లో సైతం వారి కదలికలు నమోదు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ, స్వయంగా ఆదిలాబాద్ అడవుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల పోలీసులు, ప్రత్యేక దళాలు, మావోల కదలికలపై నిఘా పెట్టి, వారిని చుట్టుముట్టే పనిలో పెద్దఎత్తున కూంబింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

More Telugu News