Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌

spike of 2216 new cases in telangana

  • కొత్తగా 2,216 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,57,096
  • మొత్తం 1,24,528 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 961

తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,216 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,603 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,57,096కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,24,528 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 961కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 31,607 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 341, రంగారెడ్డి జిల్లాలో 210 రోనా కేసులు నమోదయ్యాయి.

 

  • Loading...

More Telugu News