Shriya Saran: 'ఆర్ఆర్ఆర్'లో తన పాత్రపై శ్రియ స్పందన

Shriya Saran reveals her character in RRR movie

  • ఈ సినిమాలో నాది ఒక చిన్న పాత్ర
  • అజయ్ దేవగణ్ పక్కన నటిస్తున్నా
  • తారక్, చరణ్ లతో నాకు ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం

దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తదితర స్టార్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ శ్రియ స్పందిస్తూ, సినిమాలో తన పాత్ర గురించి వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదేనని ఆమె తెలిపింది.

'ఛత్రపతి' తర్వాత రాజమౌళితో మళ్లీ పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తున్నానని... ఆయన ఒక గొప్ప నటుడని కితాబిచ్చింది. అజయ్ ఎంతో మర్యాదపూర్వకమైన మనిషి అని చెప్పింది. అయితే, తారక్, చరణ్ లతో కలిసి తనకు ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధగా  ఉందని తెలిపింది. వారి పాత్రలు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పింది.

Shriya Saran
RRR Movie
Tollywood
Junior NTR
Ramcharan
Rajamouli
  • Loading...

More Telugu News