Sonu Sood: పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్ షిప్పులు.. వివరాలు ఇవిగో!
- ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి స్కాలర్ షిప్ లు
- కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి
- scholarships@sonusood.me కు మెయిల్ దరఖాస్తులు పంపాలి
- 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ
కరోనా సంక్షోభం సమయంలో పేదలకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సినీనటుడు సోనూసూద్ తన సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రైతులకు, నిరుద్యోగులకు కూడా అండగా నిలుస్తోన్న ఆయన విద్యార్థుల చదువులకు కూడా సాయం అందిస్తానని తాజాగా ప్రకటన చేశారు.
పేద విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని తెలిపారు.
వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండి, మంచి మార్కులతో పాసైన విద్యార్థులు అందరూ దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. వైద్య విద్య, ఇంజినీరింగ్, బిజినెస్ స్టడీస్, జర్నలిజం వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తులను scholarships@sonusood.me మెయిల్‌కు 10 రోజుల్లో పంపించాలని ఆయన తెలిపారు.