Pawan Kalyan: పవన్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్ ని దింపుతున్న క్రిష్!

Hollywood technician for Pawan movie

  • పవన్ తో క్రిష్ చారిత్రాత్మక కథా చిత్రం 
  • 'వకీల్ సాబ్' తర్వాత షూటింగుకి పవన్ 
  • బెన్ లాక్ నేతృత్వంలో వీఎఫ్ఎక్స్  
  • విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు  

ప్రస్తుతం చేస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ లాక్ డౌన్ కి ముందు హైదరాబాదులో జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది.

ఈ చిత్రం చారిత్రాత్మక కథతో రూపొందుతుండడం వల్ల చిత్రంలో వీఎఫ్ఎక్స్ పనులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత వుందట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు 'ఆక్వామెన్', 'స్టార్ వార్స్ ఎపిసోడ్ 7', 'వార్ క్రాఫ్ట్' వంటి చిత్రాలకు బెన్ లాక్ వీఎఫ్ఎక్స్ సమకూర్చి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. ఈయనను క్రిష్ తన చిత్రానికి నియమించుకున్నట్టు సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విలన్ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నారు. అలాగే, ఈ చిత్రానికి పవర్ ఫుల్ సంభాషణలు అవసరం కావడంతో బుర్రా సాయిమాధవ్ ను రచయితగా ఎంచుకున్నారు.

మరోపక్క చిత్రంలో భారీ యాక్షన్ దృశ్యాలు కూడా ఉంటాయట. వాటిని రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరిస్తారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. వారి ఎంపిక త్వరలో పూర్తవుతుంది.            

Pawan Kalyan
Krish
AM Ratnam
Hollywood
  • Loading...

More Telugu News