Prakash Raj: హీరోయిన్ కంగ‌న‌కు చుర‌క‌లంటించిన ప్ర‌కాశ్ రాజ్

prakashraaj justasking

  • ఒక్క సినిమాతో కంగ‌నా ల‌క్ష్మీభాయి అయిపోతుందా?
  • మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె?
  •  అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్?

గత కొంతకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఢీ కొడుతూ బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ను వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజ‌జీవితంలోనూ ఎవరికీ త‌ల వంచ‌నంటూ ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ ట్వీట్ చేసింది. దీనిపై సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చుర‌క‌లంటించారు.

"ఒక్క సినిమాతో కంగ‌నా ర‌నౌత్ త‌న‌ను తాను రాణి ల‌క్ష్మీబాయితో పోల్చుకుంటే మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌గా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన ఆమిర్ ఖాన్, మోదీగా న‌టించిన వివేక్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు" అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవ‌ల కంగనా ర‌నౌత్ శివ‌సేన నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంబైకి వెళ్ల‌డం, డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు విన‌ప‌డుతుండ‌డం వంటి ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఆమెకు బీజేపీ మ‌ద్ద‌తు ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Prakash Raj
Tollywood
Bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News