Corona Virus: తెలంగాణ‌లో కొత్తగా 2,278 క‌రోనా కేసులు

new 2278 corona cases in telangana

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880
  • మొత్తం 1,21,925 మంది డిశ్చార్జ్  
  • మృతుల సంఖ్య మొత్తం 950            

తెలంగాణ‌లో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,278 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,458 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 950కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి.    
                  

  • Loading...

More Telugu News