Nara Lokesh: టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?: నారా లోకేశ్

YSRCP cadre has to decide Jagan is a leader or not says Nara Lokesh

  • ప్రతిపక్ష నేతను తిట్టించినప్పుడు జగన్ కు మర్యాద గుర్తుకు రాలేదా?
  • బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టారు
  • మా కార్యకర్త అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము జగన్ కి లేదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టించి ఆనందపడిన రోజున జగన్ గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైసీపీ నేతలపై చర్యలు ఉండవని రాసుకున్నారా? అని ట్వీట్ చేశారు.

తాము కూడా తిట్టగలమని, కానీ అది తమ పార్టీ సంస్కృతి కాదని చెప్పినందుకు టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని లోకేశ్ మండిపడ్డారు. బ్రహ్మంకి అండగా టీడీపీ ఉంటుందని చెప్పారు. తమ కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ము లేక, కేసులు పెట్టే జగన్ నాయకుడో? లేక దద్దమ్మో? వైసీపీ శ్రేణులే తేల్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News