Rakul Preet Singh: ఇన్ స్టా ద్వారా మొబైల్ కి ప్రమోషన్ మొదలెట్టిన రకుల్!

Rakul promotes mobile phone

  • సోషల్ మీడియా ద్వారా తారల సంపాదన 
  • రకుల్ కు ఇన్ స్టాలో 15.5 మిలియన్ల ఫాలోవర్స్  
  • మొబైల్ ఫోన్ కి ప్రచారం చేస్తూ వీడియో పోస్ట్
  • ప్రస్తుతం రకుల్ చేతిలో మూడు సినిమాలు

సినిమా హీరోయిన్ల స్పాన్ తక్కువ కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించేసుకుంటారు. ఎప్పుడు తమ వెనుక కొత్త అమ్మాయిలు వచ్చి దూసుకుపోతారో తెలియని ఫీల్డు కాబట్టి, తమకు వచ్చిన ఏ అవకాశాన్నీ సాధారణంగా వదులుకోరు. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు, మాల్స్ ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ ఎడాపెడా సంపాదిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ఆదాయాన్ని పొందే అవకాశం రావడంతో మన తారలు వాటిని కూడా వదలడం లేదు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి సోషల్ మీడియా ఖాతాలలో ఎక్కువ మంది ఫాలోవర్స్ వున్న తారలను ఆయా ప్రొడక్ట్ కంపెనీలు తమ ప్రచారకర్తలుగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు వీటి ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడీ కోవలో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. ఆమె ఇన్ స్టాగ్రాం ఖాతాకి 15.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. దీంతో తాజాగా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ రకుల్ చేత తమ ఉత్పత్తికి ప్రచారం చేయించుకుంది. సదరు బ్రాండ్ మొబైల్ ను ప్రమోట్ చేసేలా చెబుతూ, అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఇదిలావుంచితే, ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రకుల్.. త్వరలో నితిన్ చిత్రంలోనూ, కరణం మల్లేశ్వరి బయోపిక్ లోను కూడా నటించనుంది.

Rakul Preet Singh
Krish
Karanam Malleswary
Instagram
  • Loading...

More Telugu News