Rajyasabha: వైఎస్ జగన్ కు ఫోన్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!

Bihar Cm Phoned to Ys Jagan

  • రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
  • బరిలో ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్
  • మద్దతు ఇవ్వాలని జగన్ ను కోరిన నితీశ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, నిన్న రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో, తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలకాలని నితీశ్ కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

 కాగా, ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యుల బలముందన్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనుండగా, తొలి రోజునే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం హరివంశ్ నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్ గా ఉండగా, ఈ ఏడాదితో ఆయన పదవీకాలం ముగియనుండగా, మరోమారు ఆయన పోటీలో ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News