Devineni Uma: పథకాల పేర్లు మార్చి, ఏమార్చడం తప్ప మీరేం చేశారో చెప్పండి: దేవినేని ఉమ

Devineni Uma slams jagan

  • కార్పొరేషన్స్, సబ్ ప్లాన్ ల నిధుల మళ్లింపు
  • దళిత పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం తగ్గింపు
  • అదీ మూడేళ్ల తర్వాతే  
  • పథకాలకే పేర్లు మార్చి, కోతలు కోశారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాత ప‌థ‌కాల‌కే కొత్త పేర్లు పెట్టి వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతూ రాజ‌కీయ లాభం పొందాల‌నుకుంటోందంటూ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ స‌ర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెడుతున్నార‌ని, వీటి కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండవ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

కార్పొరేషన్‌ పద్దులోనే ఆసరా, ఇతర పథకాలు ఉన్నాయ‌ని, అంతేగాక‌, ఇచ్చేదానిలోనూ ఎన్నో కోతలు, ఆంక్షలు ఉంటున్నాయ‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లో తీసుకొచ్చిన‌ ‘పసుపు కుంకుమ’లో ప్రతి డ్వాక్రా మహిళకు లబ్ధి చేకూరింద‌ని, ఇప్పుడు ‘ఆసరా’గా తెస్తున్న అదే స్కీంలో ఎన్నో చిక్కులు ఉన్నాయ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

కార్పొరేషన్స్, సబ్ ప్లాన్ ల నిధుల మళ్లింపు, దళిత పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం 45 నుంచి 15 శాతానికి తగ్గింపు, అదీ మూడేళ్ల తర్వాతే. పసుపు కుంకుమతో ప్రతి ఒక్క డ్వాక్రామహిళకు లబ్ధి. నేడు అప్పు ఎక్కువ ఉంటేనే లబ్ధి. తెలుగు దేశం పార్టీ తీసుకొచ్చిన పథకాలకే పేర్లు మార్చి, కోతలు కోసి కొత్త పేర్లతో ఏమార్చడం తప్ప మీరేం చేశారో చెప్పండి వైఎస్ జ‌గ‌న్ అంటూ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించారు.

Devineni Uma
Telugudesam
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News