COVID-19: దేశంలో 45 లక్షలు దాటిన క‌రోనా కేసులు

India COVID19 case tally crosses 45 lakh mark

  • గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415
  • మృతుల సంఖ్య మొత్తం 76,271
  •  9,43,480 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స  

దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతోంది. ప్ర‌తిరోజు రికార్డు స్థాయిలో కేసులు న‌మోదవుతు‌న్నాయి. మొత్తం కేసుల సంఖ్య 45 ల‌క్ష‌ల మార్కును దాటింది. గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,209 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 76,271కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 35,42,664 మంది కోలుకున్నారు. 9,43,480 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,40,97,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,63,542 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News