Balakrishna: బోయపాటి సినిమాలో బాలకృష్ణకు జోడీగా మళ్లీ అంజలి!

Anjali opposite Balakrishna

  • బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో సినిమా 
  • కొత్త అమ్మాయిని పరిచయం చేస్తామన్న దర్శకుడు 
  • తాజాగా అంజలినే ఎంచుకున్నట్టు ప్రచారం 
  • 'డిక్టేటర్'లో బాలయ్యతో జతకట్టిన అంజలి

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమాకు సంబంధించి కథానాయిక విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కొత్తమ్మాయిని పరిచయం చేస్తామని ఆమధ్య దర్శకుడు బోయపాటి ప్రకటించారు. అన్నట్టుగానే కొత్త ఫేస్ కోసం యూనిట్ బాగా ప్రయత్నించింది. అయితే, కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఆ ఎంపిక కుదరలేదని తెలుస్తోంది.

దీంతో తిరిగి పాత హీరోయిన్ నే ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలో ప్రముఖ కథానాయిక అంజలిని తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రంలో అంజలి ఆయన సరసన జతకట్టిన సంగతి తెలిసిందే. ఆమె ఎంపిక దాదాపు పూర్తయిందని అంటున్నారు.

ఇక, షూటింగ్ విషయానికి వస్తే, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఒక్కొక్కరూ షూటింగులు ప్రారంభిస్తుండడంతో ఈ చిత్రం యూనిట్ కూడా రెడీ అవుతోంది. ఈ నెలలోనే షెడ్యూలు హైదరాబాదులో మొదలవుతుందని సమాచారం.    

Balakrishna
Boyapati Sreenu
Anjali
Dictator
  • Loading...

More Telugu News