Bonthu Rammohan: తిరుమలలో టీటీడీ చర్యలు భేష్: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్!

Hyderabad Mayor B Rammohan in Tirumala
  • స్వామి వారిని దర్శించుకున్న బొంతు రామ్మోహన్
  • కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు
  • భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న బొంతు
ఈ ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కరోనా నివారణకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు.

స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కరోనా సోకకుండా అన్ని రకాలుగా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. భక్తులు సైతం భౌతిక దూరాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, కొండపై వైరస్ జాడ కనిపించకుండా చూసేందుకు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోమారు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనుందని రామ్మోహన్ జోస్యం చెప్పారు.
Bonthu Rammohan
Tirumala
Tirupati
TTD
Corona Virus

More Telugu News