Charan: 'ఆచార్య'లో రామ్ చరణ్ కి జోడీగా రష్మిక?

Rashmika opposite Ram Charan in Acharya
  • 'ఆచార్య'లో కీలక పాత్రలో చరణ్ 
  • జోడీగా కియరా అద్వానీ పేరు ప్రచారం
  • తాజాగా రష్మిక పేరు తెరపైకి
రామ్ చరణ్ కి జోడీ ఎవరన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్సుగా మారింది. చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో ఓ కీలక పాత్రలో తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కి జోడీ పాత్ర కూడా ఉంటుందట. అయితే, ఆ పాత్రలో నటించేది ఎవరన్న విషయం గత కొన్ని రోజులుగా సస్పెన్సుగా సాగుతోంది.

బాలీవుడ్ నటి కియరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన కథానాయికగా నటిస్తుందంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, తాజాగా రష్మిక పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరి, రష్మిక ఎంపిక పూర్తయిందా? లేక కియరానే నటిస్తుందా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!  
Charan
Rashmika Mandanna
Kiara Advani

More Telugu News