Kangana Ranaut: కంగనా రనౌత్ కు అండగా నిలుస్తా: సుబ్రహ్మణ్య స్వామి

We are With You Kangana says Subrahmanya Swamy

  • తన వ్యాఖ్యలతో విమర్శలు తెచ్చుకున్న కంగన
  • క్లిష్ట సమయంలో అండగా నిలుస్తాం
  • ట్విట్టర్ లో వెల్లడించిన సుబ్రహ్మణ్య స్వామి

డ్రగ్స్, సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో తన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా ముంబయిలో డ్రగ్స్ మాఫియా, సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ డ్రగ్స్ వాడకంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కంగన నిజంవైపే నిలబడాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో మేమంతా ఆమెకు అండగా నిలుస్తామని వెల్లడించారు.

Kangana Ranaut
Subrahmanya Swamy
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News