House fly: ఈగను చంపబోయి ఇంటిని తగలబెట్టుకున్నాడు!

 france man blows kitchen while trying swat fly

  • ఫ్రాన్స్‌లోని చిన్న గ్రామంలో ఘటన
  • తినే సమయంలో అతడి ముందుకొచ్చి చికాకు పరిచిన ఈగ
  • చంపేందుకు బయలుదేరి ప్రాణాలతో బయటపడిన వృద్ధుడు

అవును.. తనను చికాకు పరుస్తున్న ఈగను చంపబోయిన ఓ వృద్ధుడు ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఫ్రాన్స్‌లోని పార్కుల్-చెనాడ్ అనే చిన్న గ్రామంలో జరిగిందీ ఘటన. 80 ఏళ్ల వృద్ధుడు రాత్రి భోజనానికి కూర్చున్న సమయంలో ఓ ఈగ వచ్చి అక్కడే తిరుగుతూ అతడిని చికాకు పెట్టింది. దానిని తోలుతున్నా అది పదేపదే అతడి వద్దకు వచ్చి అసహనానికి గురిచేసింది. దీంతో ఇక లాభం లేదనుకున్న అతడు భోజనాన్ని అక్కడే వదిలేసి తొలుత ఈగ సంగతి చూడాలనుకున్నాడు. వెంటనే ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకుని దాని వెనక పడ్డాడు.

ఈగ ఇల్లంతా తిరుగుతూ చివరికి వంట గదిలోకి దూరింది. అతడు కూడా దాని వెనకే అందులోకి దూరాడు. అయితే, అప్పటికే కిచెన్‌లో గ్యాస్ లీకవుతోంది. ఈ విషయాన్ని గుర్తించని వృద్ధుడు గదిలోకి ప్రవేశించిన వెంటనే, చేతిలో వున్నది ఎలక్ట్రిక్ బ్యాట్ కావడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో వంటగదిలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో కిచెన్ ధ్వంసం కాగా, ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, వృద్ధుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడిని గాయాలపాలు చేసిన ఈగ తప్పించుకుందా? లేక, ఆ మంటల్లో కాలి బూడిదైందా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. వృద్ధుడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలిశాక మనకు రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా గుర్తుకు వస్తుంది కదూ?

House fly
france
Old man
electric Rocket
house
Fire Accident
  • Loading...

More Telugu News