Uttar Pradesh: యూపీలో దారుణం.. బావిలో పడిన ఆవుదూడను కాపాడబోయి ఐదుగురి మృతి

five dead while saving calf

  • గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో దుర్ఘటన
  • బావిలో నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా మృతి
  • సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి

ఉత్తరప్రదేశ్‌ గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. పాడుబడిన బావిలో పడిన ఆవుదూడను రక్షించే క్రమంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బావి పాడుబడడంతో గ్రామస్థులు దాంట్లో చెత్త వేసేవారు. నిన్న ఆ బావిలో ఓ లేగదూడ పడిపోయింది. గమనించిన ఓ వ్యక్తి దానిని రక్షించేందుకు నిచ్చెన వేసుకుని బావిలోకి దిగాడు. కిందికి దిగిన వ్యక్తి బావిలో వెలువడిన విషవాయువు పీల్చి స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అందులో దిగిన మరో నలుగురు కూడా విషవాయువుల కారణంగా స్పృహతప్పిపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక, మునిసిపాలిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Uttar Pradesh
gas leak
Calf
5 dead
cow
  • Loading...

More Telugu News