Telangana: టీఎస్ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా.. కలకలం!

TS Assembly employee tests with Corona positive

  • నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • నిన్న విధులు నిర్వహించిన ఉద్యోగికి కరోనా పాజిటివ్
  • ఆందోళనలో ఇతర ఉద్యోగులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ టెస్టులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.

Telangana
Assembly
Employee
Corona Positive
  • Loading...

More Telugu News