Gupteswar Pandey: ఎన్సీబీ బలమైన ఆధారాలే సంపాదించినట్టుంది: రియా అరెస్ట్ పై బీహార్ డీజీపీ వ్యాఖ్యలు

Bihar DGP comments on Rhea Chakraborty arrest

  • సుశాంత్ వ్యవహారంలో రియా అరెస్ట్
  • గత కొన్నిరోజులుగా రియాను విచారిస్తున్న ఎన్సీబీ
  • డ్రగ్స్ విక్రేతలతో రియా లింకులు నిర్ధారణ అయ్యుంటాయన్న డీజీపీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక డ్రగ్స్ భూతం ఉందన్న కోణంలో విచారణ జరుపుతున్న ఎన్సీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రియాకు వ్యతిరేకంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బలమైన ఆధారాలే సంపాదించినట్టుందని అభిప్రాయపడ్డారు. "రియా నుంచి ఎన్సీబీ అధికారులు పూర్తి సమాచారం రాబట్టారని అనుకుంటే, ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో సంబంధాలు కూడా కచ్చితంగా వెల్లడై ఉంటాయి. ఈ కోణంలో రియా పాత్ర స్పష్టం కావడంతో ఆమెను అరెస్ట్ చేసి ఉంటారు" అని పాండే అభిప్రాయపడ్డారు.

Gupteswar Pandey
Bihar DGP
Rhea Chakraborty
NCB
Arrest
Sushant Singh Rajput
Bollywood
  • Loading...

More Telugu News